కమీషన్ల కోసమే కాళేశ్వరం: కవిత

April 10, 2026


img

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే విమర్శించారు. “కాంగ్రెస్‌ ప్రభుత్వం చాలా నిర్దాక్షిణ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పడేసింది, ఇప్పుడు దానికి మరమత్తులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇది మంచి నిర్ణయమే. కాళేశ్వరం ప్రాజెక్టుని సమర్ధంగా వినియోగించుకుంటే తెలంగాణకు నీళ్ళ కొరత ఉండదు. కనుక ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. కానీ రెండున్నరేళ్ళు పక్కనపడేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకి మరమత్తులు చేయిస్తుందంటే నమ్మశక్యంగా లేదు. బహుశః కమీషన్ల కోసమే మరమత్తులు చేయించడానికి సిద్దపడిందేమో? కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు విలువ, దాని పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే ఇన్నేళ్ళు నిరుపయోగంగా పక్కన పదేసేది కాదు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 


Related Post