దేవుడే నన్ను మీ వద్దకు పంపాడు: జీవన్ రెడ్డి

April 10, 2026


img

కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు సిద్దమైన జీవన్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆహ్వానం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఫామ్‌హౌసుకి వచ్చారు. ఆయనని కేసీఆర్‌ ఆప్యాయంగా కౌగలించుకొని శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన జీవన్ రెడ్డి, “అన్నా! ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే నీ దగ్గరకు పంపాడు,” అన్నారు. 

కేసీఆర్‌ ఆయనతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇద్దరూ కాసేపు రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించుకున్నాక కలిసి భోజనం చేశారు. బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేతలు కూడా వారితో కలిసి భోజనాలు చేశారు. 

ఈ నెల 27న బీఆర్ఎస్‌ పార్టీ ప్లీనరీ సభ జరుగుతుంది. కనుక ఆ సభలో కేసీఆర్‌ చేతుల మీదుగా జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్‌ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.    



Related Post