సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. గత రెండేళ్ళలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వచ్చిన అవాంచనీయ మార్పులు గురించి అయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం మొదలు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల వరకు అందరూ పదవి, అధికారమే ముఖ్యమనుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకోసం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకొని తెచ్చుకుని వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇప్పుడు వారే పార్టీ విధానాలను, నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారని, ఇందుకు తాజా మున్సిపల్ ఎన్నికలే చక్కటి నిదర్శనమన్నారు.
పార్టీ కష్టకాలంలో జెండా మోసిన నాయకులకు, కార్యకర్తలకు విలువ, సముచిత గౌరవం ఇవ్వనప్పుడు పార్టీలో కొనసాగడం అనవసరమని భావించి పార్టీకి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని జీవన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన ఆవేదన ఆయన మాటల్లోనే...