ఫిరాయింపు ఎమ్మెల్యేలలో అనర్హత వేటు పడే ప్రమాదం పొంచి ఉన్నవారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఒకరు. ఈరోజు ఆయన తన నియోజకవర్గం పరిధిలో రూ.1.40 కోట్లు విలువైన డ్రైనేజ్, రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అనర్హత వేటు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “నా రాజీనామా గురించి ఇంకా చర్చించలేదు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఎందుకంటే రాజీనామా చేయడానికైనా. ఎన్నికలలో పోటీ చేయడానికైనా నేను ఎప్పుడూ సిద్దమే. గెలుపు నా రక్తంలోనే ఉంది.
ఈ అంశంపై నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. అక్కడే నా వాదనలు వినిపిస్తాను. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది కనుక ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు,” అని దానం నాగేందర్ అన్నారు.