సిఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా అనేక అభివృద్దిపనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో మాజీ సిఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ అక్రమంగా పోగేసుకున్న సొమ్ము కోసమే వారి కుటుంబంలో కేటీఆర్, కవిత, హరీష్ రావులు కీచులాడుకుంటున్నారు. ప్రజలను పీడించి దోచుకున్న సొమ్ము కోసమే వారి పోరాదుకున్తున్నారు. కానీ ప్రజల కడుపులు కొట్టి అక్రమంగా డబ్బు పోగేసుకుంటే ఎవరూ బాగుపడరు. ఇందుకు కేసీఆర్, ఆయన కుటుంబమే ప్రత్యక్ష నిదర్శనం,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, “సమైక్య రాష్ట్రంలో తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో దాని ఎత్తు 150కి తగ్గించి నిర్మించడానికి ప్రభుత్వం సిద్దపడింది.
కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దానిని మొదలుపెట్టకుండా, పేరు మార్చి, డిజైన్ మార్చి, ఏకంగా జిల్లాలు దాటించుకొని తీసుకుపోయి లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కమీషన్లకు కక్కుర్తిపడి సరిగ్గా నిర్మించకపోవడంతో ఆయన అధికారంలో ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోయింది. లక్ష కోట్లు గోదావరి పాలయ్యాయి. దాంతో ఒక్క ఎకరానికి నీళ్ళు అందడం లేదు.
ఆదిలాబాద్‌కు ఒక్క చుక్క నీరు రాలేదు. రాదు. కనుక మన ప్రభుత్వం ఇక్కడే తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుని స్వయంగా పర్యవేక్షిస్తారు. త్వరలో టెండర్లు పిలుస్తాము. టెండర్లు ఖరారు ఖరారు కాగానే నేనే స్వయంగా వచ్చి ఈ ప్రాజెక్టుకి శంకు స్థాపన చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజల సొమ్ము దోచుకున్న ఎవడూ బాగుపడుడు. దోచుకున్న సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
అంబేద్కర్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపట్టి.. ఆదిలాబాద్ కు నీళ్లు ఇస్తాం.
- సీఎం రేవంత్ రెడ్డి#RevanthReddy pic.twitter.com/ybNI8CP18Z