తెలంగాణ నేతల విమర్శలపై జనసేన స్పందన

December 03, 2025


img

ఏపీ డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆయన సినిమాలకు తెలంగాణలో అనుమతించబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలను తప్పు పట్టారు. తెలంగాణ నేతల విమర్శలు అంతకంతకూ పెరుగుతుండటంతో పవన్‌ కళ్యాణ్‌ తరపున జనసేన పార్టీ స్పందిస్తూ ‘మాటలను వక్రీకరించవద్దు...’ అంటూ నేడు సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేసింది. 

దానిలో “రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పర్యటించినప్పుడు రైతులతో ముచ్చటిస్తూ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మద్య సహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవచ్చు,” అని జనసేన కోరింది. 

కనుక పవన్‌ కళ్యాణ్‌ ఆవిధంగా మాట్లాడలేదని చెప్పినట్లే భావించవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్న తెలంగాణ నేతలకు జనసేన విడుదల చేసిన ఈ లేఖ ఇంకా ఆగ్రహం కలిగించడం ఖాయం. కనుక దీనిపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతల స్పందన ఏవిదంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. 



Related Post