తెలుగు సినీ నటుడు నారా రోహిత్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల 13న హైదరాబాద్‌లో శిరీష లేళ్ళతో వివాహ నిశ్చితార్దం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు.
తాజాగా నారా రోహిత్‌కు కాబోయే భార్య శిరీష లేళ్ళ ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. వాటిలో పెళ్ళికి ముందు పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం ఫోటోలున్నాయి. మా ఇంట్లో పెళ్ళి పనులు మొదలయ్యాయని శిరీష తెలియజేశారు. ఆమె వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
పెళ్ళి పనులు మొదలయ్యాయని ఆమె స్వయంగా ఫోటోలు పెట్టి చెప్పేశారు కనుక త్వరలోనే ఆ శుభముహూర్తం కూడా ప్రకటిస్తారు.
నారా రోహిత్ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామూర్తి నాయుడి కుమారుడు. నారావారి కుటుంబం రాజకీయాలలో ఉన్నప్పటికీ నారా రోహిత్ సినీ పరిశ్రమలోకి వచ్చి సినిమాలు చేస్తున్నారు.