కేరళలో బ్రిటన్ యుద్ధ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్

June 15, 2025


img

అవును. బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35బి అనే స్టెల్త్ ఫైటర్ జెట్ శనివారం రాత్రి కేరళలో తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. అరేబియా సముద్రంలో మోహరించి ఉన్న హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమాన వాహక నౌక నుంచి నిన్న రాత్రి బయలుదేరిన ఫైటర్ జెట్‌లో ఇంధనం వేగంగా ఖాళీ అయిపోవడంతో సమీపంలో ఉన్న తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు పైలట్ అనుమతి కోరగా అనుమతించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. 

శనివారం రాత్రి 9.30 గంటలకు ఈ యుద్ధ విమానం భద్రంగా ల్యాండ్ అయ్యిందని తెలిపారు. అయితే ఇది విదేశీ యుద్ధ విమానం, దేశ భద్రతకు సంబందించిన విషయం కనుక ఈ విషయం రక్షణశాఖకు తెలియజేసినట్లు తెలిపారు. రక్షణశాఖ అనుమతి లభించిన తర్వాత యుద్ధ విమానంలో ఇంధనం నింపుతామని అధికారులు తెలిపారు.


Related Post