ఇటీవల తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసిన వివేక్ వెంకట స్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ముగ్గురికీ మంత్రిత్వ శాఖలు, సచివాలయంలో ఛాంబర్లు కేటాయించేశారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యయణగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండార్స్ సంక్షేమం సంక్షేమం, సాధికారత శాఖలు కేటాయించి మొదటి అంతస్థులో 13,14,15,16 నంబర్ గదులు కేటాయించారు.
వివేక్ వెంకట స్వామి: గనులు, జియాలజీ, కార్మిక, ఉపాధి,శిక్షణ శాఖలు కేటాయించగా సచివాలయంలో రెండో అంతస్తులో 20,21,22 నంబర్ గదులు కేటాయించారు.
వాకిటి శ్రీహరి: పశు సంవర్ధక, పాడి అభివృద్ధి, యువజన సేవలు, క్రీడల శాఖలు కేటాయించి సచివాలయంలో రెండో అంతస్తులో 26,27,28 నంబర్ గదులు కేటాయించారు.
ముగ్గురు మంత్రులకు సచివాలయంలో ఛాంబర్స్ కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. వారివారి శాఖల అధికారులు వాటిని తమ అధీనంలోకి తీసుకొని మంత్రుల అభిరుచి, అవసరాలకు తగిన విదంగా అవసరమైన ఏర్పాట్లు చేయిస్తున్నారు. అవి సిద్దం కాగానే ముగ్గురూ బాధ్యతలు స్వీకరించనున్నారు.