టర్కీ సరఫరా చేసిన డ్రోన్లతో భారత్‌పై పాక్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. కనుక #బాయ్‌కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ తెలుగు సినీ నటుడు నిఖిల్ సిద్దార్థ్ కూడా టర్కీని బాయ్‌కలెక్టర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏటా భారతీయులు టర్కీలో పర్యటిస్తూ ఆ దేశానికి వేలకోట్లు ఆదాయం సమకూర్చి పెడుతున్నారు. భారత్‌పై దాడులు చేసేందుకు పాక్‌కు తోడ్పడుతున్న టర్కీకి మనం వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? మన డబ్బుని ఆ దేశంలో ఖర్చు చేయడం దేనికని నిఖిల్ ప్రశ్నించారు.
భారత్-పాక్ మద్య ఘర్షణలు కొనసాగుతున్నప్పుడు, టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ స్పందిస్తూ పాక్‌కు అన్ని వేళలా తాము అండగా నిలబడతామని చెప్పారు. ఆ ప్రకటనని నిఖిల్ ట్యాగ్ చేశారు.
అయితే ముందుగా టాలీవుడ్‌తో సహా యావత్ భారతీయ సినీ పరిశ్రమ టర్కీలో సినిమా షూటింగులు చేయడం మానుకోవాలి. టాలీవుడ్ తరపున నిర్మాత దిల్‌రాజు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ ప్రకటన చేస్తే అందరూ హర్షిస్తారు కదా?
Anyone still visiting Turkey ? Please read this Below Thread...
Indians Spend Billions of Dollars Every year in Turkey.
Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm