బిహార్‌కు రూ.6.. తెలంగాణకు 42 పైసలా?

March 22, 2025


img

నేడు చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల విభజన (డీలిమిటేషన్‌)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. 

పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే దానిలో 42 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోంది. తమిళనాడుకి 26 పైసలు, కేరళకు 49 పైసలు, కర్ణాటకకు కేవలం 16 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోంది. 

కానీ మధ్య ప్రదేశ్‌‌కి రూ.1.73, యూపీకి రూ.2.03, బిహార్‌ రాష్ట్రానికి 6.06 చొప్పున కేంద్రం చెల్లిస్తోంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల పట్ల ఈ వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నాను. 

దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో, సంక్షేమ పధకాల అమలులో, జనాభా నియంత్రణలో దేశానికే ఆదర్శంగా సాగుతూ పన్నుల రూపంలో దేశానికి భారీగా ఆదాయం సమకూర్చి ఇస్తున్నప్పుడు డీలిమిటేషన్‌ పేరుతో అణచివేయాలని కేంద్రం ఎందుకు ప్రయత్నిస్తోంది?

ఒకవేళ డీలిమిటేషన్‌ అమలు చేయాలనుకుంటే రాష్ట్రాలలో శాసనసభ నియోజకవర్గాలను చేయాలి తప్ప లోక్‌సభ నియోజకవర్గాలను కాదు. ఈ ప్రతిపాదనని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కనుక దీనిని విరమించుకొమ్మని ఈ వేదిక ద్వారా నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.


Related Post