ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడే

February 08, 2025


img

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడే వెలువడబోతున్నాయి. ఈ ఎన్నికలలో మళ్ళీ గెలిచి అధికారం నిలుపుకోవడానికి ఆమాద్మీ, ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బీజేపి హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశాయి. ఈనెల 5న పోలింగ్ ముగిసిన వెంటనే వివిద మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దాదాపు అన్ని సంస్థలు ఈసారి బీజేపి గెలిచి అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాయి. 

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 19 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఢిల్లీ శాసనసభలో 70 సీట్లు ఉన్నందున కనీసం 36 సీట్లు గెలుచుకున్న పార్టీకి అధికారం లభిస్తుంది. బీజేపి, ఆమాద్మీ పార్టీలు ఎంతగా ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ కేవలం 60.54 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కనుక ఓట్ల లెక్కింపు త్వరగానే పూర్తయ్యి ఫలితాలు వెలువడనున్నాయి. కనుక ఉదయం 10-11 గంటలలోగానే 36 సీట్లలో ఆధిక్యాలతో స్పష్టత వస్తుంది. మద్యాహ్నం 12 గంటల్లోగా బీజేపి, ఆమాద్మీ పార్టీలలో ఏది అధికారంలోకి రాబోతోందో తేలిపోతుంది. 

గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకధాటిగా 15 ఏళ్ళ పాటు ఢిల్లీని పాలించింది. కానీ ఆమాద్మీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రయత్నిస్తున్నా గెలవలేకపోతోంది. ఈసారి కూడా పోటీ బీజేపి, ఆమాద్మీ పార్టీల మద్యనే సాగింది. కనుక కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాజయం పాలవబోతోందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి.


Related Post