ఢిల్లీ కారు బాంబు కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ బృందం, ఈ దాడి కోసం నిందితుడు ముజమ్మిల్ షకీల్ మరికొందరు కలిసి ఓ మదర్సాలో బాంబులు తయారుచేసినట్లు కనుగొంది. దీనిపై మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ముస్లిం పిల్లలకు ఇస్లాం మతం గురించి నేర్పించే మదర్సాలను ఉగ్రవాదులు ఈవిధంగా దుర్వినియోగం చేయడం చాలా బాధాకరం. మదర్సా కోసం ఓ చిన్న గది కూడా నిర్మించలేని ఇలాంటి మూర్ఖుల, మదర్సాలో బాంబులు తయారు చేసి యావత్ ముస్లిం సమాజానికి చెడ్డపేరు తెచ్చారు. ఇలాంటి పనులతో దేశ భద్రతకు భంగం కలిగించడమే కార్యక్రమంలో ముస్లింలందరూ తల దించుకునేలా చేశారు.
ఢిల్లీ కారు బాంబు దాడిలో చనిపోయిన 14 మందిలో ముస్లింలు కూడా ఉన్నారు. సాటి మనుషులను చంపాలనే ఆలోచనే చాలా తప్పు. ఈ దేశాన్ని శత్రువులుగా భావించేవారు ఎవరైనా వారు దేశంలో ముస్లింలకు కూడా శత్రువులే. ఇలాంటి వారిని పట్టుకొని చట్టప్రకారం కటినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను,” అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.