ట్రెజర్ హంటర్, గ్లోబ్ ట్రోటర్ కలిస్తే?

November 22, 2025

img

మహేష్ బాబు గ్లోబ్ ట్రోటర్‌గా రాజమౌళితో కలిసి ప్రపంచాన్ని చుట్టబెడుతుంటే, నాగ చైతన్య కార్తీక్ దండుతో కలిసి దట్టమైన అడవులలో ‘ట్రెజర్ హంట్’కి బయలుదేరారు. ఇప్పుడీ ట్రెజర్ హంటర్, గ్లోబ్ ట్రోటర్ చేతులు కలుపుబోతున్నారు.

నాగచైతన్య-కార్తీక్ దండు కాంబినేషన్‌లో ఎన్సీ24 వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న సినిమా టైటిల్‌ ప్రకటించే సమయం వచ్చేసింది.

కనుక గ్లోబ్ ట్రోటర్ మహేష్ బాబు చేత ట్రెజర్ హంటర్ నాగ చైతన్య సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌ సోమవారం ఉదయం 10.08 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఎన్సీ24 చిత్ర బృందం ఈ విషయం తెలియజేస్తూ వారిద్దరి ఫోటోతో ట్వీట్ చేసింది.

ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. యువ హిందీ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్)ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Who better than the #Globetrotter to introduce the TREASURE HUNTER to this world 🌎❤️

Superstar @urstrulyMahesh will be unveiling the #NC24 Title and First Look Poster tomorrow at 10:08 AM 🦁🔥#SSMBforYUVASAMRAT ❤️‍🔥❤️‍🔥❤️‍🔥 pic.twitter.com/dPUBG8M7bK
— NC24 (@Nc24chronicles) November 22, 2025

Related Post