ఎల్ఐకె.. టీజర్‌ చూశారా?

April 01, 2026


img

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో యువ నటుడు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా చేసిన ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) తెలుగు టీజర్‌ విడుదలైంది. 2040లో లవ్-రిలేషన్ షిప్ ఏవిధంగా ఉంటాయో తెలియజేస్తూ ఈ సినిమా తీశారు. కానీ రొటీన్ మాస్ మసాలా సినిమాకి టెక్నాలజీ హంగులద్దిది సరిపోదు. సినిమా టీజర్‌ని మించి ఉంటేనే థియేటర్లలో నిలబడగలదు. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, యోగి బాబు, సీమాన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

టీజర్‌ అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అలాగే ఈ సినిమాలో అనిరుధ్ ఒక రోబోకు వాయిస్ ఓవర్ ఇచ్చారని టీజర్‌ ద్వారా తెలిసింది. 

ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విఘ్నేష్ శివన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: రవి వర్మన్, ఎడిటింగ్: ప్రదీప్ ఇ. రాఘవ్ చేస్తున్నారు.

నయనతార, ఎస్‌.ఎస్‌. లలిత్ కుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత చివరికి ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ ఫ్యూచరిస్టిక్ రామ్-కామ్ కాన్సెప్ట్ నేటి యువత బాగా కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. 


Related Post