చంద్రబాబు నాయుడు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్

September 10, 2023


img

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. శనివారం తెల్లవారు జామున ఆయనను నంద్యాలలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఏపీలో రాజకీయాలు ఒక్కసారియాయ వేడెక్కాయి. ఆదివారం ఉదయం నుంచి సాయత్రం వరకు ఏసీబీ కోర్టులో సుదీర్గ  విచారణ తర్వాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమాబింధు చంద్రబాబు నాయుడుకి 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు.

చంద్రబాబు నాయుడుకి రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పగానే, ఆయన తరపు న్యాయవాదులు వెంటనే బెయిల్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం దానిపై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఒకవేళ ఆయనకు బెయిల్ తిరస్కరించిన్నట్లయితే భారీ పోలీస్ బందోబస్తు మద్య చంద్రబాబు నాయుడుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో శనివారం ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడుని జైలుకి పంపిస్తే మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చు. కనుక ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించింది ఏపీ ప్రభుత్వం.       


Related Post