తెలంగాణకు ఇక అంతేనా... లేక....

July 06, 2019


img

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, భగీరధ పధకాలకు రూ.24,000 కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని అడిగిఅడిగి నోరు నొప్పేడుతోందే తప్ప ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తె

లంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బిజెపి రాష్ట్రం పట్ల ఈవిధంగా వ్యవహరించడం ఆశ్చర్యకరమే. ఎన్నికలప్పుడే రాజకీయాలు... ఆ తరువాత అంతా అభివృద్ధి గురించే ఆలోచిస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కనుక కేంద్రప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంతో సంబందాలు మెరుగుపరుచుకొని, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుందా...లేక రాష్ట్రంలో బిజెపి రాజకీయంగా బలపడేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఇదివరకు ఏపీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంతో వ్యవహరించినట్లే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంతో కూడా వ్యవహరిస్తుందా...తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.


Related Post