ఎర్రకోట మెట్రో స్టేషన్‌ వద్ద భారీ ప్రేలుడు

November 10, 2025
img

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్‌ వద్ద ఈరోజు సాయంత్రం 6.52 గంటలకు భారీ పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే సమయంలో మెట్రో స్టేషన్‌ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ విస్పోటనం జరిగింది. పేలుడు తీవ్రతని బట్టి బహుశః ఇది ఉగ్రదాడి కావచ్చనిపిస్తోంది.   

ఈ ఘటనలో ఘటనా స్థలంలో 11 మంది చనిపోగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేసింది. 

పోలీసులు, ర్యాపిడి యాక్షన్ ఫోర్స్ అక్కడకు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలను బ్యారికేడ్లతో మూసివేశారు. ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి. బాంబ్ డిస్పోసల్ బృందాలు ఘటనా స్థలంతో సహా ఢిల్లీ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్ సోదాలు నిర్వహిస్తోంది. 

కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో హై అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌తో సహా దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాలలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్ తదితర బహిరంగ ప్రదేశాలలో పోలీసులు తనికీలు నిర్వహిస్తున్నారు. కూడా అనుమానిత ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.  ఢిల్లీ, హైదరాబాద్‌తో సహా పలు నగరాలలో పోలీసులు వాహనాలు తనికీలు చేస్తున్నారు. 

ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ తదితరులు అత్యవసరం సమావేశమైనట్లు సమాచారం.

Related Post