కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తున్న సినిమా టైటిల్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని ఖరారు చేస్తూ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్‌తో దర్శకుడు ఈ సినిమా కధని క్లుప్తంగా చెప్పేశారు. \
ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతీ ఇద్దరు హీరోయిన్లున్నారు. ఆ ఇద్దరు ఆడాళ్ళతో మన హీరోకి ఎదురయ్యే సమస్యలే ఈ సినిమా కధ.
ఎప్పుడూ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు చేస్తూ ఎదురుదెబ్బలు తింటున్న రవితేజ, మంచి కామెడీకి అవకాశం ఉన్న ఇలాంటి కధతో సినిమా చేస్తున్నారు. పైగా కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకుడు. టైటిల్ గ్లిమ్స్ కూడా అందరినీ అలరించింది. కనుక ఈ సినిమాతో రవితేజ తప్పక హిట్ కొడతారని ఆశించవచ్చు.
ఈ సినిమాలో వెన్నెల ప్రశాంత్ కిషోర్, సునీల్, సత్య, శుభలేక సుధాకర్, మురళీధర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కిషోర్ తిరుమల,సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: ఈ సందర్భంగా ప్రకాష్ చేస్తున్నారు.
ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండగకు భర్త మహాశయులకు విజ్ఞప్తి చేసేందుకు వస్తున్నామని టైటిల్ గ్లిమ్స్‌లో తెలియజేశారు.