బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు

July 06, 2019


img

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పాలి. బడ్జెట్‌లో తెలంగాణకు చేసిన కేటాయింపులను ఒకసారి పరిశీలిస్తే ఆ విషయం అర్ధమవుతుంది. 

కేంద్రం నుంచి రాష్ట్రానికి అందబోయే పన్నుల వాటా: రూ. 19,718 కోట్లు. (గత ఏడాది అందిన మొత్తం: రూ. 18,560.31 కోట్లు. పెరిగిన మొత్తం: రూ.1,157.69 కోట్లు)   

గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి: రూ.4 కోట్లు. 

సింగరేణి అభివృద్ధికి: రూ.1,850 కోట్లు (గత ఏడాది రూ.2,000 కోట్లు ప్రకటించి 1,100 కోట్లు మాత్రమే మంజూరు చేసింది).  

స్మార్ట్ సిటీలుగా ఎంపికైన వరంగల్‌, కరీంనగర్ అభివృద్ధికి: రూ. 13,750 కోట్లు.     

నేషనల్ ఫిషరీస్ బోర్డు (హైదరాబాద్‌): రూ.80.75 కోట్లు. 

ఆయతమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసర్చి (హైదరాబాద్‌)కు :రూ. 319.39 కోట్లు.    

స్వాతంత్ర్య సమరయోధుల పించన్లకు: రూ. రూ.952.81 కోట్లు.  

దేశంలోని అన్ని సీడ్యాక్ లకు కలిపి రూ.120 కోట్లు, సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్తలన్నిటికీ కలిపి 30 కోట్లు కేటాయించింది. వాటిలో కొంతవాటా తెలంగాణకు లభిస్తుంది. 

యావత్ దేశ ప్రజలతో ప్రపంచదేశాల దృష్టిని కూడా ఆకర్షించిన కాళేశ్వరం, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల ప్రస్తావన బడ్జెట్‌లో కనబడకపోవడం విస్మయం కలిగిస్తుంది. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు లాభదాయకం కాదని తేల్చిచెప్పేసి ఎప్పుడో చేతులు దులుపుకొంది కనుక బడ్జెట్‌లో దాని ఊసు లేదు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రజలు, ప్రభుత్వం తలుచుకొంటూ బాధపడటమే తప్ప మరేమీ లేదు. దేశ ఆర్ధికవ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తూ, అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధిసాధిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే, రాష్ట్రం నుంచి కేంద్రానికి మరింత ఆదాయం సమకూరి ఉండేది. బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని కోరుకోవడం అత్యాశగానే కనిపిస్తోంది. 


Related Post