విశ్వక్ సేన్‌ లెగసీ షూటింగ్‌ సమాప్తం

November 28, 2026


img

 ‘లెగసీ’ (ట్యాగ్ లైన్‌: పాలిటిక్స్ ఈజ్ పర్సనల్) షూటింగ్‌ పూర్తయిందని మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ హీరో స్వయంగా ఎక్స్‌లో తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని 2027, ఫిభ్రవరిలో లెగసీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని విశ్వక్ సేన్‌ తెలిపారు.   

సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రాజకీయాలు పవర్, రక్తపాతం, ప్రేమ గురించి అని నాలుగు ముక్కల్లో చెప్పేశారు.   

ఈ సినిమాలో ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కేకే మీనన్ విలన్‌గా నటిస్తున్నారు. మురళీ మోహన్, రావు రమేష్, సచిన్ ఖేడేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.         

ఈ సినిమాకు కధ: సాయికిరణ్ రెడ్డి దైడ, కవి సిద్దార్థ, పాటలు: అనంత్ శ్రీరాం, కవి సిద్దార్థ, సంగీతం: గోవింద్ వసంత్, కెమెరా: జీజు సన్నీ, యాక్షన్: ఝాషువా, ఎడిటింగ్: శిరీష్ ప్రసాద్ చేస్తున్నారు. 

ఆరోహి దైదా సమర్పణలో కలాహి మీడియా బ్యానర్‌పై దర్శకుడు సాయికిరణ్ రెడ్డి దైదా, యశ్వంత్ దగ్గుమాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. లెగసీ 2027, ఫిభ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">THE SHOOT IS DONE. THE COUNTDOWN BEGINS. 🔥 #LEGACY has officially wrapped up filming. Post-production is in full swing, and the stage is being set for its grand worldwide theatrical release in FEBRUARY 2027. Power. Love. Bloodline. Politics. Saikiran Reddy Daida’s second film. POLITICS IS PERSONAL. ⚔️ A Kalaahi Media Production. A Govind Vasantha Musical. #LegacyMovie #KayKayMenon #EktaRathod #SaikiranReddyDaida #KalaahiMedia</p>&mdash; VishwakSen (@VishwakSenActor) <a href="https://x.com/VishwakSenActor/status/2126603548406530243?ref_src=twsrc%5Etfw">November 28, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

Related Post

సినిమా స‌మీక్ష