చంద్రయాన్ అనగానే ఇస్రో చేస్తున్న ప్రయోగమే అని అందరూ అనుకుంటారు. కానీ ఈ చంద్రయాన్ మన మందమర్రి కుర్రోళ్ళతో నిర్మాతగా మారిన దర్శకుడు వేణు ఊడుగుల చేస్తున్న ప్రయోగం. ‘చంద్రయాన్’ సినిమా అని తేలిపోయింది కనుక దాని ట్రైలర్ గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవాలి.
అశ్విన్ వైష్ణవ్ ‘కల్కి’ కోసం పెద్ద వర్క్ షాప్ పెట్టి దానిలో ఏవేవో తయారుచేసినట్లు, మన మందమర్రి కుర్రోళ్ళు కూడా ఓ చిన్న వర్క్ షాప్ ఏర్పాటు చేసుకొని ‘గూగుల్ మామ’ సహాయసహకారాలతో రాకెట్ తయారుచేసి వదులుతారు.
ఇస్రో అంతటి సంస్థ పంపిన రాకెట్లే కింద పడిపోతున్నప్పుడు మనోళ్ళు పంపిన రాకెట్ కింద పడకుండా ఉంటుందా? కనుక వాళ్ళ ‘చంద్రయాన్’ ఇలా మొదలైందో, ఎలా ముగిసిందో తెలియాలంటే ముందు ఈ ట్రైలర్, ఆ తర్వాత ఈ నెల 13న విడుదలవుతున్న ఈ సినిమా చూడాల్సిందే.
శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రలు చేస్తున్నారు.
చంద్రయాన్ కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: శ్రీనాథ్ చంద్రశేఖర్, సినిమాకు సంగీతం: హర్ష ప్రవీణ్, సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బి, ఎడిటింగ్: పి.ఆర్. తేజ దాసరి చేశారు.