బారాత్ సాంగ్‌ ఇరగదీసింది నాగదుర్గ కొత్త పిల్లేనా?

November 08, 2026


img

వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి, హీరోయిన్‌గా పరిచయమవుతున్న నాగదుర్గల ‘ఇడుపు కాయితం’ నుంచి నేడు దీపావళి పండుగ సందర్భంగా హుషారైన పెళ్ళి బారత్ పాట విడుదల చేశారు.

ఈ పాటకు నాగదుర్గ చేసిన డాన్స్ చూస్తే ఈమెకు ఇదే మొదటి సినిమా లేక చాలా సినిమాలు చేసిందా? అని అనుమానం కలుగుతుంది. అంత అద్భుతంగా డాన్స్ చేసింది.

మొదట ఆమె డాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయిన మన హీరో తర్వాత ఆమెతో కలిసి హుషారుగా డాన్స్ చేయడం కూడా బాగుంది. 

ఈ సినిమాలో మైమ్ మధు, అభయ్ బేతిగంటి, రచ్చ రవి, జోర్దార్ సుజాత, బిత్తిరి సత్తి, చంద్రవ్వ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫి: ఎం.ఎస్. బాల్ రెడ్డి ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి, ఆర్ట్ డైరెక్టర్‌: ఆశిష్ తేజ పులాల చేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు

సుకుమార్ రైటింగ్స్, బీవీ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వంశీ రెడ్డి దొండపాటి, సురేష్ బొబ్బిలి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష