రామ్ చరణ్‌కి హీరోయిన్‌ ఫిక్స్

October 31, 2026


img

‘పెద్ది’ తర్వాత రామ్‌ చరణ్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో ‘ఆర్‌సీ-17’ చేయబోతున్నారు. నవంబర్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి నెలాఖరులోగా రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలో హీరోయిన్‌గా చాలా పెద్ద పేర్లు వినబడినప్పటికీ, చివరికి మన అచ్చ తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లిని ఖరారు చేసినట్లు తాజా సమాచారం. 

సల్మాన్ దుల్కర్ ప్రధాన పాత్ర చేసిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సాత్విక వీరవల్లి సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ సినిమా ఇంకా విడుదల కాక మునుపే రెండో సినిమాతో ఇటువంటి గొప్ప అవకాశం దక్కించుకోవడం అదృష్టమే.

అమెరికాలో జన్మించిన సాత్విక వీరవల్లి అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆమె తల్లి వనిత వీరవల్లి వద్ద భరత నాట్యం నేర్చుకున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష