ఆకాశంలో ఒక తార నుంచి రాధే రాధే లిరికల్

October 30, 2026


img

పవన్ సాదినేని దర్శకత్వంలో సల్మాన్ దుల్కర్‌ హీరోగా చేస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నుంచి రాధే రాధే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. శ్రీమణి వ్రాసిన ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం అందించి లిప్సిక భాష్యంతో కలిసి పాడారు.        

ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటి శ్రుతీ హాసన్ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. అంతరిక్ష శాస్త్రవేత్త అవ్వాలనే ఓ గ్రామీణ యువతి కల సాకారం చేసుకోవడానికి హీరో ఏవిధంగా సాయపడతాడనేది ఈ సినిమా కథ.    

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: గంగరాజు గుణ్ణం, కథ, దర్శకత్వం: పరవన్ సాదినేని, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్‌, కెమెరా: సుజీత్ సారంగ్, ఆర్ట్: వంశీ కృష్ణ; ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేస్తున్నారు. 

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమా,  లైట్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమా నాలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 20న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష