గెజ్జె ఫస్ట్‌ ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల..

October 03, 2026


img

అంకిత అమర్‌, భరత్‌ గుప్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గెజ్జె.’ ‘ఎప్పుడైతే అమ్మవారి పిలుపు వస్తుందో..’ అంటూ ఓ చక్కటి ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో అంకిత అమర్‌, భరత్‌ గుప్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మయూర్రా రాఘవేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంగీతం, నృత్యం, భక్తి సమ్మేళనంతో తీస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌లో వెల్లడించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: మయూర్రా రాఘవేంద్ర; సంగీతం: మయూర్‌ అంబేకల్లు; గానం: కేఎస్‌ హరిశంకర్‌; సాహిత్యం: మయూర నైగ; సినిమాటోగ్రఫీ: అభిమన్యు సదానందన్‌; ఎడిటింగ్‌: రాహుల్‌ వశిష్ట చేస్తున్నారు.

హోంభోలే బ్యానర్‌పై సునీల్‌ కుమార్‌ రామచంద్ర ఈ సినిమా నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష