ఈ నెల 18న.. పిఠాపురంలో అలా మొదలైంది!

September 09, 2026


img

మహేష్‌ చంద్ర దర్శకత్వంలో డా. రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్‌ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పిఠాపురంలో అలా మొదలైంది చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో  జూనియర్ పవన్ కళ్యాణ్, జబర్దస్త్ శేషు, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడ్యార్ కీలక పాత్రలలో నటించారు.

ఈ సినిమాకు కథ: ఆకుల సురేష్ పటేల్, మాటలు & స్క్రీన్‌ప్లే: శ్రీరామ్ ఈదోటి, సంగీతం: జి.సి.క్రిష్, అందించారు. 

ప్రేమ, హాస్యం, తండ్రీకూతుర్ల సెంటిమెంట్‌తో పాటు యువతకు మంచి సందేశం ఇచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని దర్శకుడు మహేష్‌ చంద్ర తెలిపారు. ఎటువంటి అసభ్య డైలాగ్స్, అసభ్య సన్నివేశాలు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీనిని తెరకెక్కించామని చెప్పారు. .

చంద్ర సినిమా టీమ్, ఎవర్‌ గ్రీన్‌ ఎపిక్‌ సినిమా బ్యానర్లపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్, ఎఫ్‌.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తోంది.


Related Post

సినిమా స‌మీక్ష