మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ‘లెగసీ’... ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అనే ట్యాగ్ లైన్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో రూపొందుతున్న ‘లెగసీ’ డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ హీరోహీరోయిన్లు రెండు గుర్రాలపై సవారీ చేస్తూ ముద్దు పెట్టుకొంటున్న ఓ పోస్టర్ వేశారు.
ఈ సినిమాలో ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా, ప్రముఖ బాలీవుడ్ నటుడు కేకే మీనన్ విలన్‌గా నటిస్తున్నారు. మురళీ మోహన్, రావు రమేష్, సచిన్ ఖేడేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ: సాయికిరణ్ రెడ్డి దైడ, కవి సిద్దార్థ, పాటలు: అనంత్ శ్రీరాం, కవి సిద్దార్థ, సంగీతం: గోవింద్ వసంత్, కెమెరా: జీజు సన్నీ, యాక్షన్: ఝాషువా, ఎడిటింగ్: శిరీష్ ప్రసాద్ చేస్తున్నారు.
ఆరోహి దైదా సమర్పణలో కలాహి మీడియా బ్యానర్‌పై దర్శకుడు సాయికిరణ్ రెడ్డి దైదా, యశ్వంత్ దగ్గుమాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న లెగసీ థియేటర్లలో విడుదల కాబోతోంది.