నేడు టీజర్‌.. అక్టోబర్‌లో తెల్ల కాగితం

September 05, 2026


img

రమేష్ బండ్రేడ్డి దర్శకత్వంలో హర్ష రోహాన్, నక్షత్ర జంటగా చేస్తున్న ‘తెల్ల కాగితం’ వచ్చే నెల అంటే అక్టోబర్‌ 2న విడుదల కాబోతోంది. అప్పుడే ఈ సినిమా టీజర్‌ విడుదల చేసి ప్రమోషన్స్‌కి సిద్ధమైపోయింది చిత్ర బృందం. 

 హైస్కూల్ విద్యార్ధుల మద్య ఆకర్షణలు ప్రేమలుగా భావించి ముందుకు వెళ్తే, తెల్లకాగితం మీద ఎరుపు రంగు పడుతుందని ఉపాధ్యాయుడు చెప్పడం, హీరోయిన్‌కి వచ్చిన కష్టం(బహుశః గర్భం దాల్చడం)కు నేను తోడుగా ఉంటానని హీరో చెప్పడం, ఇద్దరూ కన్నీళ్ళు పెట్టుకోవడం టీజర్‌లో చూపారు. కనుక తెల్ల కాగితంపై దర్శకుడు రమేష్ చాలా పెద్ద విషయమే వ్రాసినట్లనిపిస్తుంది. 

ఈ సినిమాలో దీపక్, అజయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: నందు సవిరిగన, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: కేవీ గుహన్, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: ఆర్‌. కార్తీక శ్రీనివాస్ చేశారు.

కే. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష