నవంబర్‌లో ఈ నగరానికి ఏమైంది-2

September 02, 2026


img

తరుణ్ భాస్కర్‌ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్‌ ప్రధానపాత్ర చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాను ‘ఈ నగరానికి ఏమైంది-రిపీట్ అనే పేరుతో సీక్వెల్‌ వస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది, నవంబర్‌ 19న థియేటర్లలో కలుద్దామని దర్శకుడు తరుణ్ భాస్కర్‌ తెలియజేశారు.    

ఈ సినిమాలో అభినవ్ గోమఠం, వెంకటేష్‌ కాకమాను, శివాత్మిక రాజశేఖర్, అనిషా అంబ్రోస్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. తొలి చిత్రంలో కార్తీక్‌ పాత్ర పోషించిన సాయి సుశాంత్‌ రెడ్డి స్థానంలో ఈసారి శ్రీనాథ్‌ మాగంటి నటిస్తున్నారు. 

స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలతో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం 2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత కాలంలో కల్ట్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఈ సినిమా 2023లో రీ-రిలీజ్‌ అయినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. దీంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సీక్వెల్‌కు కూడా వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్‌; ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల చేశారు.  

ఎస్‌ ఒరిజినల్స్‌, రూట్‌నోడ్‌ సినిమా బ్యానర్లపై సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష