టాక్సిక్‌ ట్రైలర్‌.. ఈసారి కాస్త డిఫరెంట్ !

August 08, 2026


img

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్‌ హీరోగా ‘టాక్సిక్‌’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్) ట్రైలర్‌ నేడు విడుదలైంది. ఈసారి ట్రైలర్‌లో తీవ్ర భావోద్వేగా సన్నివేశాలతో పాటు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చూపించి అసలు ఈ టాక్సిక్ దేని గురించి అని అందరిలో ఆసక్తి రేకెత్తించగలిగారు.       

‘టాక్సిక్‌’లో నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌ ఐదుగురు నటించారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్‌), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేశారు.  

కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ తదితర భారతీయ భాషల్లో డబ్ చేసి ఆగస్ట్ 28న విడుదల చేయబోతున్నారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/0safa-gtIgQ?si=bCbAJFoTb2x-4xWu" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష