ఆగస్ట్ 6న టీజర్‌ ది ప్యారడైజ్ టీజర్‌

August 04, 2026


img

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ టీజర్‌ ఈ నెల 6న విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ నాని నీడని గద్ద రూపంలో చూపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వేశారు. టీజర్‌ 1.35 నిమిషాల నిడివి ఉంటుందని తెలియజేస్తూ ‘జడల్ జమానా’కు అందరూ సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ తగిలించారు.   

ఈ సినిమాలో నానికి జోడీగా సుబ్బు... సుబ్బలక్ష్మిగా కయాదు లోహార్ నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.               

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 

ఆగస్ట్ 21న సినిమా విడుదల చేయబోతున్నట్లు ఇది వరకే ప్రకటించారు. టీజర్‌ పోస్టర్లో రిలీజ్‌ డేట్ చూపలేదు. కనుక అదే రోజున విడుదలవుతుందా లేదా అనేది టీజర్‌లో చెప్తారేమో?  


Related Post

సినిమా స‌మీక్ష