అవును. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేసిన ‘లెనిన్’ సక్సస్ అవడంతో చిత్ర బృందం సంబురాలు జరుపుకుంటుంటే, సోషల్ మీడియాలో కొందరు శ్రీలీలని ట్రోలింగ్ చేస్తున్నారు.
మొదట ఈ సినిమాలో శ్రీలీలని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె బిజీగా ఉండటంతో భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు. కనుక శ్రీలీల ఒక హిట్ మిస్ చేసుకుందనుకోవాలి. కానీ ఆమె ఈ సినిమాలో నటించకపోవడం వల్లనే హిట్ అయ్యిందని కొందరు, ఒకవేళ నటించినా భాగ్యశ్రీ బోర్సేలా మెప్పించలేకపోయేదని కొందరు విమర్శిస్తున్నారు.
కానీ శ్రీలీల కావచ్చు మరొకరు కావచ్చు ప్రతీ ఒక్కరూ సినిమా కోసం చాలా శ్రమిస్తుంటారు. కానీ ఇతర కారణాల వలన సినిమా ఫ్లాప్ అయితే ఇలాంటి సందర్భాలలో విమర్శించడం పరిపాటిగా మారింది.
తనని అకారణంగా కొందరు ట్రోల్ చేస్తున్నప్పటికీ శ్రీలీల స్పందించలేదు. ఆమెకు ఇలాంటి విమర్శలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అంత తీరిక కూడా లేదు.