నెట్‌ఫ్లిక్స్‌లో అర్జున్ బ్లాస్ట్

June 20, 2026


img

కోలీవుడ్‌ సీనియర్ నటుడు అర్జున్ ప్రధాన పాత్రలో వచ్చిన యాక్షన్ చిత్రం ‘బ్లాస్ట్’ పాజిటివ్ టాక్ సంపాదించుకొని మంచి కలెక్షన్స్‌ సాధించింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 25నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్, అభిరామి, చిదంబరం, పవన్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

క్లుప్తంగా కథ: రాజారామ్ (అర్జున్) కుటుంబం సాధారణ జీవనం సాగిస్తుంటుంది. కానీ కుటుంబంలో అర్జున్, అభిరామి, వారి కుమార్తె నీలగా నటించిన ప్రీతి ముకుందన్ ముగ్గురూ కరాటే నిపుణులు. మెడికల్ షాప్ నిర్వహిస్తున్న నీలని ఓ రౌడీ గ్యాంగ్‌కు చెందిన రౌడీ బెదిరించి మందులు ఎత్తుకుపోబోతాడు. నీల అతనిని చితక్కొట్టి పోలీసులకు అప్పజెపుతుంది. దాంతో అతని వెనుక ఉన్న మోస్ట్ వాంటడ్‌ క్రిమినల్ అర్జున్ అబ్రహం నీల కుటుంబంపై పగబడతాడు. కానీ అందుకు వేరే బలమైన కారణం ఉంటుంది. అదేమిటో సినిమా చూసి తెలుసుకోవాలి.      



Related Post

సినిమా స‌మీక్ష