మస్సా మస్సా... మేకింగ్ వీడియో చూశారా?

June 02, 2026


img

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న ‘పెద్ది’ ప్రీమియర్స్ రేపు (జూన్‌ 3)న ఉంటాయి. కనుక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. కనుక ప్రమోషన్స్ జోరుగానే సాగుతున్నాయి.

వాటిలో భాగంగానే పెద్దిలోని మస్సా మస్సా పాట మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఆ మేకింగ్ వీడియో చూస్తే ఆ పాట కోసం రామ్‌ చరణ్‌, చిత్ర బృందం ఎంతగా శ్రమించిందో అర్ధమవుతుంది.   

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌, కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన పెద్ది జూన్ 4న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.   


Related Post

సినిమా స‌మీక్ష