పవన్ కళ్యాణ్‌ సమావేశంపై ఇంకా అనిశ్చిత

June 02, 2026


img

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్, గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జనసేన పార్టీ ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’ నిర్వహించాలనుకున్నారు.

కానీ వివిధ కారణాల చేత పోలీసులు అనుమతి నిరాకరించారు. కనుక సభ నిర్వహించుకునేందుకు అనుమతించాలని కోరుతూ జనసేన తెలంగాణ విభాగం ఈరోజు ఉదయం  హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. ఒకవేళ హైకోర్టు సభ నిర్వహించుకోవడానికి అనుమతించినట్లయితే యధావిధిగా సాయంత్రం సభ జరుగుతుంది. లేకుంటే జూబ్లీహిల్స్‌లోని పవన్ కళ్యాణ్‌ నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు.

ఇటీవల ప్రొ.నాగేశ్వర్ సోమాజీగూడలో ప్రెస్‌మీట్‌ పెట్టిన తర్వాత ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మద్య మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్‌ నగరంలో సభ లేదా సమావేశం నిర్వహించినట్లయితే ఉద్రిక్తతలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో అనుమతి నిరాకరించినట్లు అర్ధమవుతూనే ఉంది. కానీ పార్కింగ్ సమస్య కారణంగా అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Related Post