తెలంగాణలో ఎటు చూసినా పండుగ వాతావరణమే

June 02, 2026


img

తెలంగాణలో ఎండలు మండిపోతున్నప్పటికీ ఓ పక్క నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరోపక్క పలు జిల్లాలలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ళలో లబ్దిదారుల గృహా ప్రవేశాలతో రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు సోమవారం వివిధ జిల్లాలలో లబ్దిదారుల సామూహిక గృహాప్రవేశాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. నేడు కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత పలు జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ళలో గృహా ప్రవేశాల కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.  

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్షన్నర పైగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం పూర్తి కాగా వాటిలో ఇప్పటికే 40,000 మంది గృహాప్రవేశాలు చేశారు. ఈ రెండు రోజులలో ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, మేడ్చల్, మహబూబ్‌నగర్‌, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో మరో 50,000 ఇళ్ళలో గృహాప్రవేశాలు జరుగబోతున్నట్లు సమాచారం. 


Related Post