మూడు రంగుల్లో ధగధగా మెరిసిపోతున్న సచివాలయం

June 02, 2026
img

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయాన్ని విద్యుదీపాలతో అందంగా అలంకరించారు. సోమవారం రాత్రి ముచ్చటగా మూడు రంగులలో సచివాలయం ధగధగా మెరిసిపోయింది. పక్కనే అమరజ్యోతి విద్యుత్ దీపాల వెలుతురులో మిలమిలా మెరిసిపోయింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అట్టహాసంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఉదయం 8.30 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఎగురవేసి ఈ వేడుకలు ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రాలలలో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకలు నిర్వహిస్తారు. 


Related Post