సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్, త్రిప్తి దిమ్రీ జంటగా నటిస్తున్న ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొన్నటి వరకు హైదరాబాద్‌లో అజీజ్ నగర్‌లో కొన్ని ముఖ్య సన్నివేశాలు షూట్ చేశారు.
తర్వాత షెడ్యూల్లో కోఠీ విమెన్స్ కాలేజీలో హీరోయిన్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తొలిసారిగా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసరుగా యూనిఫారంలో కనిపించబోతున్నారు. విమెన్స్ కాలేజీలో జరిగే షూటింగ్‌లో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ జైలు సూపరిండెంట్‌గా నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసరుగా పని చేసిన ప్రభాస్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారు. ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానం ట్రైలర్‌లో చెప్తారేమో? ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబిరాయ్, కాంచన ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ; సంగీతం: హర్ష వర్ధన్ రామేశ్వర్; కెమెరా: రాజ్ తోట; యాక్షన్: సుప్రీమ్ సుందర్; ఆర్ట్: ఘార్గి ముఖర్జీ చేస్తున్నారు.
గుల్షన్ కుమార్ & టీ సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, ప్రభాకర్ రెడ్డి వంగ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.