ప్రముఖ నటుడు సత్యదేవ్ వృద్దుడైన రాజవంశీకుడు ‘రావు బహదూర్’గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది విడుదల కాకమునుపే అజయ్ నాగ్ దర్శకత్వంలో ‘సమవర్తి’ అనే మరో సినిమా మొదలు పెట్టేశారు.
దట్టమైన అడవులలో, కొండ కోనల్లో తీస్తున్న సమవర్తి మేకింగ్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. అది చూసినప్పుడు అడవులలో ప్రకృతి ఇంత అద్భుతంగా ఉంటుందా? అని ఆశ్చర్యపోక తప్పదు. సమవర్తి షూటింగ్ కోసం ఎంచుకున్న లోకేషన్స్ అన్నీ ఒక దానిని మించిన మరొకటిగా ఉన్నాయి.
ఈ సినిమాలో సత్యదేవ్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గానవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కధ దర్శకత్వం: సంగీతం: సింజిత్ ఎర్రమిల్లి, కెమెరా: హర్ష మల్లిఖార్జున, బలరాం తివారీ, డైలాగ్స్: ఆర్ట్: మొండ్రు రవికుమార్, ఎడిటింగ్: ఆదిత్య తివారీ చేస్తున్నారు.
ఈ యాక్షన్, అడ్వంచర్ మూవీని రుద్రా పిక్చర్స్, పంచభూత క్రియేషన్స్ బ్యాన్లర్లపై శశిధర్ రెడ్డి, శివ చరణ్ రెడ్డి కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.