సందీప్ కిషన్ పవర్ పేట టీజర్‌... మమ్మమ్మాస్!

May 08, 2026


img

గీత రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న ‘పవర్ పేట’ టీజర్‌ గురువారం విడుదల చేశారు. కల్పన థియేటర్ వద్ద సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు చేసే హడావుడిలో హీరో సందీప్ కిషన్ ఎంట్రీ ఇచ్చిన తీరు మాస్ ఆడియన్స్‌కి మంచి కిక్కిస్తుంది. టీజర్‌ పక్కా మాస్‌గా ఉంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ టీజర్‌ని మరింత గొప్పగా మార్చింది. ఈ సినిమా ప్రేమ, గౌరవం, రాజకీయాల గురించి అని టైటిల్‌ పోస్టర్లోనే చెప్పారు. 

70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్‌ విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా సంగీతం: మణిశర్మ, కెమెరా:ఆర్‌.మధి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు. 

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు.    

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/4u6IgRMcWmA?si=Ibpmif173zqFtERy" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష