శ్రీ విష్ణు విన్యాసం... ఈ నెలాఖరున రిలీజ్!

February 14, 2026


img

శ్రీవిష్ణు తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ శ్రీవిష్ణు బైక్‌పై చిద్విలాసంగా కూర్చున్న పోస్టర్ ఒకటి వేశారు. ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడీగా నాయన సారిక నటిస్తున్నారు. మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: యదునాథ్ మారుతి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: రాధన్, కెమెరా: సాయి శ్రీరాం, ఎడిటింగ్: కార్తికేయన్ రోహిణి, కోరియోగ్రఫీ: భాను, ఈశ్వర్ పెంటి, స్టంట్స్: విజయ్, పృథ్వి, ఆర్ట్: ఏ రామాంజనేయులు చేశారు. 

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిభ్రవరి 28న విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష