అల్లు అర్జున్‌తో భేటీయా... బాబోయ్!

February 10, 2026


img

అల్లు అర్జున్‌కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. ఆయన చేసే ప్రతీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంటుంది. ఆయనకున్న క్రేజ్ వలన కొన్ని వాణిజ్య ప్రకటనలు కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఆయనతో షూటింగ్ అంటే ఆ షరతులు, ఆంక్షలు తట్టుకోలేమని రాయల్ ఎన్ఫీల్డ్ (మోటార్ సైకిల్) బ్రాండ్ వ్యూహ నిపుణురాలు కావెరేఎ బారువా చెప్పారు.

ఆమె తాజాగా ఓ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో సెట్స్‌లో ప్రముఖ సినీ హీరోల తీరు ఏవిధంగా ఉంటుందో వివరిస్తూ అల్లు అర్జున్‌ ప్రస్తావన వచ్చినప్పుడు, “ఆయనతో షూటింగ్ అంటే ఏమేమి చేయాలో చేయకూడదో 42 ఆంక్షలతో కూడిన పెద్ద జాబితా అయన మేనజర్ మన చేతికి ఇస్తారు. ఆ మేనేజర్ మీద మరో మేనేజర్, ఆయన మీద మరో మేనేజర్ చాలా మందే ఉంటారు.

నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఆయనకు ఎవరూ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఆయన కళ్ళలోకి సూటిగా చూడకూడదనే రెండు షరతులు!

ఓసారి నేను లొకేషన్‌లో ఓ మూల ఎక్కడో కూర్చొని నా మొబైల్ ఫోన్లో వచ్చిన మెసేజులు చూసుకుంటున్నాను. అప్పటికి ఇంకా అల్లు అర్జున్‌ రాలేదు. కనుక షూటింగ్ ప్రారంభం కాలేదు. కానీ ఇంతలోనే ఆయన సిబ్బంది ఒకరు వచ్చి నా చేతిలో మొబైల్ ఫోన్ బలవంతంగా లాగేసుకున్నారు. ఏమంటే మీకిచ్చిన జాబితాలో లోకేషన్లో మొబైల్ ఫోన్ వాడకూడదనే షరతు ఉంది చూడలేదా? అంటూ నన్నే గట్టిగా నిలదీశారు,” అని కావేరీ బారువా చెప్పారు.             

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr">Yeh hai Pushpa ka rule : Massive respect to <a href="https://twitter.com/alluarjun?ref_src=twsrc%5Etfw">@alluarjun</a> Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South&#39;s Icon sets his own in Bombay? Suddenly it&#39;s &#39;too much&#39; and shocking?… <a href="https://t.co/FALbtiv1Dn">pic.twitter.com/FALbtiv1Dn</a></p>&mdash; AnandTanniru (@ceoyktv) <a href="https://twitter.com/ceoyktv/status/2021159764114461033?ref_src=twsrc%5Etfw">February 10, 2026</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

Related Post

సినిమా స‌మీక్ష