సూపర్ హిట్ సినిమా ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘ఫౌజీ’ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. త్వరలో యాక్షన్ సీన్స్ షూటింగ్ మొదలవబోతోంది.
ఏకధాటిగా మూడు నెలల పాటు యాక్షన్స్ సీన్స్ షూట్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరో 20 రోజులలో బ్యాలన్స్ వర్క్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలలో వీలైనంత వరకు ప్రభాస్ డూప్, బాడీ డబుల్ లేకుండా స్వయంగా చేయబోతున్నారు.
1930-47 మద్య రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ఓ సైనిక యోధుడుగా ఈ సినిమా కధని వ్రాసుకున్నారు. దీనికి ఫ్రీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు హనీ రాఘవపూడి చెప్పారు. రెండు భాగాలలో ప్రభాస్ పాత్ర తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు.
ఫౌజీలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తుండగా, జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపం ఖేర్, భాను చందర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ప్రభాస్‌తో సినిమా అంటే అది తప్పనిసరిగా పాన్ ఇండియా మూవీయే. కనుక రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఫౌజీ ఈ ఏడాది ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది.