ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ దళపతికి సమస్యలు ఒక దాని తర్వాత ఒకటి క్యూకట్టినట్లు వస్తూనే ఉన్నాయి. ఓ పక్క కరూర్ ర్యాలీలో తొక్కిసలాటపై సీబీఐ చుట్టూ తిరుగుతున్నారు. మరోపక్క జన నాయగన్ సినిమా రిలీజ్ కోసం మద్రాస్ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆదాయపన్ను నోటీసుని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
విజయ్ 2015-16 సం.లలో ఆదాయం తక్కువగా చూపించినందుకు ఆదాయపన్ను శాఖ రూ.1.50 కోట్లు జరిమానా విధించింది. అయితే దానిపై ఆరేళ్ళ తర్వాత 2022లో మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు.
ఇన్నేళ్ళుగా విచారణ సాగిన తర్వాత మద్రాస్ హైకోర్టు గత నెలలో తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు తుది తీర్పు వెలువరించింది. దానిలో విజయ్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ న్యాయపోరాటాలకు విజయ్‌కి చాలా ఖర్చే అయ్యుంటుంది.
కనుక మద్రాస్ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేస్తే మరింత ఖర్చవుతుంది. కనుక రూ.1.50 కోట్లు జరిమానా చెల్లించేసి ఇక్కడితో ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతారో లేక సుప్రీంకోర్టుకి వెళతారో?