స్పైడర్ : రివ్యూ & రేటింగ్

September 27, 2017
img

రేటింగ్ : 3/5

కథ :

శివ (మహేష్) ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తుంటాడు.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనుమానం వచ్చిన వారి దగ్గరకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. ఇక ఒకరోజు అనుకోకుండా ఓ కాల్ అతని లైఫ్ లో పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి భయపడగా తనకు తెలిసిన ఓ లేడీ కానిస్టెబుల్ ను తోడుగా పంపిస్తాడు శివ. తెల్లారే సరికి ఆ ఇద్దరు మృత్యువాత పడతారు. ఆ హత్యకు కారణం ఎవరని తెలుసుకునే క్రమంలో భరత్ ను పట్టుకుంటారు. ఇక అసలు ఈ హత్యలను చేసేది భైరవుడని తెలుసుకుని అతన్ని టార్గెట్ చేస్తాడు. ఇంతకీ శివ భైరవుడిని పట్టుకున్నాడా..? ఇద్దరి మధ్య ఫైటింగ్ ఎలా సాగింది..? పొలీసులకు భైరవుడు దొరికాడా..? శివ భైరవుడిని ఏం చేశాడు అన్నది అసలు కథ.  

విశ్లేషణ :

మురుగదాస్ మహేష్ సినిమా అనగానే ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఇక అంచనాలను అందుకోవడంలో స్పైడర్ కొంతమేరకు సక్సెస్ అయినా సినిమాలో ఎక్కడో తేడా కొట్టిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంత సరదాగా సాగించగా సెకండ్ హాఫ్ ఇంటెన్స్ తో సినిమాను నడిపించాడు. ముఖ్యంగా తల్లిని కాపాడుకునే క్రమంలో హీరో స్కెచ్ థియేటర్స్ లో విజిల్స్ పడుతుంటే.. అక్కడ ఉన్నవాడు అంటూ వచ్చే సాంగ్ లో ఏకంగా ఓ ఐదుగురు మహిళలు ఆపదలో ఉన్న వారిని కాపాడే సీన్ అదుర్స్ అని చెప్పాలి. 

ఇక క్లైమాక్స్ లో కూడా మురుగదాస్ మరోసారి తన భారీ తనం చూపించాడు. ఇంటర్వల్ టైంలో ఫైటింగ్ తో పాటుగా క్లైమాక్స్ లో బిల్డింగ్ కూలడం అక్కడ ఫైటింగ్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సినిమాలో హీరో హీరోయిన్ రొమాన్స్ కు అంతగా స్కోప్ లేకుండా పోయింది. ఏదో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది అంటే ఉంది అన్నట్టే అనిపిస్తుంది. ఇక టెక్నికల్ గా మాత్రం హై స్టాండర్డ్ తో స్పైడర్ వచ్చింది. 

మురుగదాస్ తెలుగు తమిళ భాషల్లో సినిమా తెరకెక్కించినా ఎక్కువ తమిళ ఆర్టిస్టులే ఉండటం జరిగింది. ఇక తెలుగులో మహేష్ లాంటి సూపర్ స్టార్ ను పెట్టుకుని విలన్ ను హైలెట్ చేయడం కాస్త ఇబ్బంది పెట్టింది. ఇక సర్ ప్రైజెస్ తో ఎంటర్టైన్ చేసినా కామెడీ ఎంటర్టైనింగ్ మిస్ అయినట్టు తెలుస్తుంది. ఇంటెసిబుల్ సినిమా కాబట్టి అది ఆశించకపోయినా సినిమాలో ఏదో తెలియని లోపం కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో మహేష్ చెప్పిన డైలాగ్స్ కూడా సినిమాకు హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో ఒకటి.

నటన, సాంకేతికవర్గం :

స్పైడర్ లో మహేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సినిమాలో మహేష్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. ప్రతి సీన్ లో మహేష్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కు పండుగలా అనిపిస్తుంది. ఇక మహేష్ సినిమాల్లో సాధారణంగా విలన్లు ఉంటారు కాని ఈ సినిమాలో విలన్ మహేష్ కు సరిసమానంగా నటించాడు. ఎస్.జె.సూర్య నటనకు అందరు ఫిదా అవుతున్నారు. కిరాతకుడు భైరవుడిగా సూర్య తన ఎక్సెలెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కేవలం సినిమాలో హీరోయిన్ కావాలి కాబట్టి మాత్రమే పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక ప్రియదర్శి, ఆర్జె బాలాజి కమెడియన్ ఉన్నా అంతగా గుర్తిండే పాత్రలు ఇవ్వలేదు. మిగతా పాత్రలు కూడా పరిధి మేరకు నటించారు. 

ఇక స్పైడర్ టెక్నికల్ టీం విషయానికొస్తే.. ముందుగా దర్శకుడు మురుగదాస్ కథ కాస్త కొత్తగా రాసుకుని ఉంటే బాగుండేది. ఇక రొటీన్ కథకు కథనం కూడా ఏదో ఒక రెండు మూడు సర్ ప్రైజెస్ తప్ప మిగతా అంతా సాదా సీదాగా నడిపించాడు. సినిమాటోగ్రఫీ అద్భుతం. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయాల్సింది. డైలాగ్స్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ అదరగొట్టాయి. సినిమాకు మరో హైలెట్ హారిస్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ముఖ్యంగా సూర్య కోసం వాడిన నేపథ్య సంగీతం అదరగొడుతుంది. 

ఒక్కమాటలో :

మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ స్పైడర్ ఆశించినంత రేంజ్ లో లేకపోయినా సినిమా కచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుంది.


Related Post