నిన్నుకోరి రివ్యూ & రేటింగ్

July 07, 2017
img

రేటింగ్ : 3/5

కథ :

గీతం యూనివర్సిటీలో టాప్ స్టూడెంట్ అయిన ఉమామహేశ్వర్ రావు (నాని) అనుకోకుండా ఓ దగ్గర పల్లవి (నివేథా థామస్)ను కలుస్తాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటంతో ప్రేమలో మునిగితేలుతుంటారు. పల్లవి తండ్రి మురళి శర్మ చాలా స్ట్రిక్ట్. తన కూతురికి ఎలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేయాలో ఓ క్లారిటీ ఉండగా తన ప్రేమ గురించి చెప్పలేకపోతాడు ఉమా. తన ప్రాజెక్ట్ పని మీద ఢిల్లి వెళ్లగా ఈలోగా అరుణ్ (ఆది పినిశెట్టి)తో పెళ్లి చేస్తాడు. అది తట్టుకోలేని ఉమా కెరియర్ నాశనం చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న పల్లవి ఉమాని తనతో తీసుకెళ్లి మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ ఉమా, పల్లవి ఎలా విడిపోయారు..? అరుణ్, పల్లవిల కాపురం ఎలా ఉంది..? చివరకు ఉమా ఏమయ్యాడు అన్నది అసలు కథ.

విశ్లేషణ :

నిన్ను కోరి ఓ మంచి ప్రేమ కథ. మొదటి సినిమానే అయినా దర్శకుడు తాను చెప్పదలచుకున్న పాయింట్ ఏమాత్రం తగ్గకుండా చెప్పాడు. కథ కథనాల్లో కొత్తదనం కనిపిస్తుంది. ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లిచేసుకుంటే.. అదే ప్రేమికురాలు తన జీవితానికి మళ్లీ ఓ దారి చూపిస్తే లెట్స్ వెల్ కం లైఫ్ ఇదే సినిమా కథ.

ప్రేమలో విఫలమై జీవితం ఏం లేదు అనుకున్న హీరోకి పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటున్న హీరోయిన్ తన భర్తను చూసి ముచ్చటేస్తుంది. ఇక సినిమా మొత్తం లవ్ ఫీల్ తోనే నడిపించాడు. మొదటి భాగం ఎంటర్టైన్ అన్నట్టు సాగా సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. 

సినిమాలో నాని మరోసారి తన వర్సటైల్ యాక్టింగ్ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. నివేథా కూడా అంతే బాగా నటించింది. ఆది పాత్ర చాలా రిసర్వెడ్ గా కొత్తగా ఉంటుంది. సినిమాలో ఎంటర్టైనింగ్ మిస్ అయ్యిందన్న భావన వస్తుంది. సినిమా ఓవరాల్ గా అయితే యువతరానికి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్ను కోరి సినిమాలో నాని తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో కేక పెట్టించేస్తాయి. నివేథా థామస్ కూడా నానికి ఏమాత్రం తీసిపోని విధంగా నటించి మెప్పించింది. ఇక ఆది పినిశెట్టి క్యారక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. క్యారక్టర్స్ డిజైన్ చేసిన విధానం బాగుంటుంది. ఇక మురళి శర్మ, తణికెళ్ల భరణి, సుదర్శన్ అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. కార్తిక్ ఘట్టమనేని కెమెరా వర్క్ అదిరిపోయింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. గోపి సుందర్ సంగీతం సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. దర్శకుడు తనకు వచ్చిన అవకాశాన్ని అన్నివిధాలుగా సద్వినియోగ పరచుకున్నాడు. డివివి దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి.

ఒక్కమాటలో :

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని నటించిన నిన్నుకోరి అతని హిట్ మేనియాను కంటిన్యూ చేస్తుందని చెప్పొచ్చు.


Related Post