తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ దేశ వ్యాప్తంగా ఎన్నిసంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. అయితే ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో అదే రేంజ్ లో వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే 170 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటిని విమర్శించిన తీరు బిజెపికి ఆగ్రహం తెప్పించింది. మొత్తానికి మెర్సల్ చిత్రానికి రాజకీయ రంగుపడింది.
సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో రకంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంది. తాజాగా మెర్సల్ చిత్రం తెలుగులో అదిరిందిగా వస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ లో మంచి విజయం సాధించినా కొన్ని రోజులు నుంచి తెలుగులో విడుదల అవ్వడం లేదు. ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వానిక వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ తీస్తే రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. అన్నీ అవరోధాలు దాటి నేడు రిలీజ్ కావాల్సి ఉన్నా సినిమా వాయిదా పడింది, త్వరలో మరో విడుదల డేట్ ను అనౌన్సు చెయ్యనున్నారు సినిమా నిర్మాత శరత్ మరార్.