భరత్ అను నేను రిలీజ్ ఫిక్స్..!

October 26, 2017


img

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అను నేను సినిమా అసలైతే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. కాని సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా చేశారు. డివివి ఆర్ట్స్ పతాకంలో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ అని ట్విట్టర్ పేజ్ లో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

శ్రీమంతుడు తర్వాత కొరటాల శివతో మహేష్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తున్నాడు. కచ్చితంగా ఈ ఇద్దరు మళ్లీ శ్రీమంతుడు లాంటి హిట్ కొడతాడని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. అసలైతే ఏప్రిల్ 27న అల్లు అర్జున్ నా పేరు సూర్య రిలీజ్ అన్నారు కాని ఆ సినిమా లేట్ అవుతుండటంతో మహేష్ లైన్ లోని వచ్చాడు.



Related Post

సినిమా స‌మీక్ష