ఫిభ్రవరిలో పెద్ది నుంచి రెండో పాట

January 22, 2026


img

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా చేస్తున్న ‘పెద్ది’లో ‘చికిరి చికిరి’ సాంగ్ నేటికీ సోషల్ మీడియాలో  ట్రేండింగ్ అవుతూనే ఉంది. ఇప్పుడీ సినిమా నుంచి రెండో పాట కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫిభ్రవరి మొదటి వారంలో రెండో పాట విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కనుక త్వరలోనే ఈ పాట గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్‌ ఈయవచ్చు. 

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌, కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 27న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష